మహా తెలంగాణ న్యూస్, మహబూబాబాద్ ప్రతినిధి:
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
గిరిజన మహిళనైన తనను గుర్తించి
శాసనమండలిలో బిఆర్ఎస్ పార్టీ విప్ గా అత్యున్నత పదవిని అందించినందుకు తెలంగాణ రాష్ట్ర సాధకులు మాజీముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు, పార్టీ కోసం అహర్నిశలు కృషిచేస్తున్న మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు లకు మాజీమంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తనపై ఉంచిన బాధ్యతను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తానని, ప్రజావ్యతిరేక పాలనపై పోరాటం చేస్తూనే ఉంటానని మాజీమంత్రి ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ ఈ సందర్బంగా అన్నారు.