మహా తెలంగాణ న్యూస్,
మహబూబాబాద్ ప్రతినిధి
ఐ.డి.ఓ.సి లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ జి మురళీధర్ అధ్యక్షతన రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమం, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ పై సంబందిత అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ ఆర్ బి ఎస్ కే రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమం జిల్లాలోని స్కూల్స్ మరియు అంగన్వాడి సెంటర్లలో పిల్లలందరినీ స్క్రీనింగ్ చేసి జిల్లాలో గల డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ కి పంపించి వారికి చికిత్స అందించాలని, అదేవిధంగా డైక్ సెంటర్లో ఫిజియోథెరపిస్ట్ దంత వైద్య నిపుణులు , సైక్రియాట్రిస్ట్, సోషల్ వర్కర్, వినికిడి సంబంధించిన నిపుణులు, పిల్లలందరికీ వైద్య సేవలు అందించాలని, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రిఫరల్ అయ…