మహా తెలంగాణ న్యూస్, మహబూబాబాద్ ప్రతినిధి:
నల్లగొండ- వరంగల్ -ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బుధవారం మహబూబాబాద్ పట్టణంలోని ఫాతిమా హైస్కూల్ నుండి జిల్లాలోని (16) కేంద్రాలకు సంబంధించి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పంపిణీ ప్రక్రియను పరిశీలించారు,
ఎన్నికల సంఘం సూచనల మేరకు పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉన్నామన్నారు,
కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.వీరబ్రహ్మచారి, మహబూబాబాద్,తొర్రూరు రెవెన్యూ డివిజన్ అధికారులు కే.కృష్ణవేణి, జి.గణేష్, ఎన్నికల నోడల్ అధికారులు, సెక్టరల్ అధికారులు తదితరులు ఉన్నారు.