అవినీతి పై సమరం మోగించిన కేజ్రివాల్ ఓటమికి కారణం కవితే
మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్
మహాతెలంగాణ న్యూస్,
మహబూబాబాద్ ప్రతినిధి:
మహబూబాబాద్ పర్యటనలో ఎమ్మెల్సీ కవిత రైతుల పై కపట ప్రేమ చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ గారు అన్నారు.పది ఏళ్లు అధికారంలో ఉన్నపుడు మిర్చి రైతులు గుర్తుకు రాలేదు,ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు సంకెళ్ళు వేసి జైలు కు పంపిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీది అని ధ్వజమెత్తారు.పది ఏళ్ళలో మిర్చి కి 25,000 వేల మద్దతు ధర ఎందుకు కల్పించలేక పోయారు…?ఈరోజు వచ్చి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారి మీద వ్యక్తిగత కక్ష సాధింపు సరైనది కాదు…రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కేసీఆర్ కుటుంబం ఆరోపణలు చేస్తున్నది..తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు అని తెలిపారు.వరదలు వచ్చినప్పుడు బిఆర్ఎస్ నాయకులు తిరిగినం అని చెప్తున్నారు సిగ్గు చేటు.ప్రతి నష్టపోయిన కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉన్నది,ప్రతి కుటుంబానికి ఎవరైతే నష్టపోయిల్లో అందరికీ కూడ నష్టపరిహారం ఇచ్చింది.ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరూ కూడా కనిపించలేదు.
అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న కవిత లిక్కర్ స్కామ్ లో తెలంగాణ పరువును బజారున పడేసిన ఎమ్మెల్సీ కవిత ఈరోజు రేవంత్ రెడ్డి గారి పై వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు.కేవలం అవినీతిపై పోరాటం చేసిన క్రేజీవాల్ తో సన్నిహితంగా ఉండి అయేనే రాజకీయాన్నె మనుగడకు ప్రశనర్ధకం గా మారింది ఈరోజు డిపాజిట్ కూడా గల్లంతు అయ్యింది డిల్లీలో అంటే కేవలం కవిత చేపట్టే.క్రేజీవాల్ అవినీతి మీద పోరాటం చేసిండు ఆయనని కూడా లిక్కర్ స్కాంకు అనువయించి ఆరోపణలు ఎదుర్కోవడానికి కారణం కూడా కవితే,అలాంటి మచ్చలేని నాయకుడ్ని కనుమరుగు చేసిన ఘనత కవితకే దక్కుతుంది.తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు,కాంగ్రెస్ పార్టీ,మేము ఎంపీలు అందరం కలిసి పోరాటం చేసిన తెలంగాణలో నువ్వు,మీ నాయన కెసిఆర్ మీ అన్న కేటీఆర్ మీ బావ హరీష్ రావు పదవులు అనుభవించారంటే అది కాంగ్రెస్ పార్టీ భిక్షే అని మర్చిపోవద్దు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టకపోవడం చూస్తే విఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ ఒక్కటే అని అర్థమవుతున్నది.పార్లమెంట్ ఎన్నికల్లో సైతం పరోక్షంగా బిజెపికి కూడా బిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన సంగతి తెలంగాణ ప్రజానీకానికి తెలుసు.మరోసారి కూడా రుజువు అయింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టకపోవడం పరోక్షంగా బిజెపికి మద్దతిస్తున్నట్లు కూడా స్పష్టమవుతున్నది.తెలంగాణలో బిజెపి పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి స్థానం లేదు ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు.పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో అంతా అవినీతే జరిగింది,లక్షల కోట్లు కుంభకోణం చేసి దోచుకున్న సంగతి ప్రజలకు తెలుసు ఖబర్దార్ కవిత ఇలాంటి మాటలు మాట్లాడితే సరైనది కాదు అని ఎంపీ బలరాం నాయక్ గారు తీవ్రంగా మండిపడ్డారు.