డీఎస్సీ కి ఎంపిక కాబడిన అభ్యర్థులు సర్టిఫికెట్లు వెరిఫికేషన్ కోసం ఈ క్రింది ఇవ్వబడిన ఒరిజినల్ సర్టిఫికెట్స్ అవసరం అవుతాయి ఇవి కేవలం అభ్యర్థుల అవగాహన కొరకు మాత్రమే తెలియజేస్తున్నాము. వెరిఫికేషన్ టీం ఏ సర్టిఫికెట్లు అడిగితే అవన్నీ అందించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు ఎంపిక కాబడిన క్యాటగిరిలో మీ అర్హతకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు సిద్ధం చేసుకుని వెరిఫికేషన్ కు హాజరు కావాల్సి ఉంటుంది డీఎస్సీ – 2025 నియామకాలకు కావలసిన సర్టిఫికెట్లు
- మెగా డీఎస్సీ-2025 ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రింట్‌అవుట్.
- ఎస్సెస్సీ (SSC) లేదా దానికి సమానమైన సర్టిఫికెట్.
- ఇంటర్మీడియేట్ లేదా దానికి సమానమైన సర్టిఫికెట్.
- విద్యార్హత సర్టిఫికెట్లు (డిగ్రీ మరియు పీజీ).
- ప్రొఫెషనల్ అర్హత సర్టిఫికెట్లు (D.Ed./Spl.D.Ed./B.Ed./Spl.B.Ed./UGDPED/B.P.Ed. మొదలైనవి).
- TET/CTET అసలు స్కోర్ కార్డ్ / మార్క్స్ మెమో.
- IV తరగతి నుండి X తరగతి వరకు చదువుకున్న సర్టిఫికెట్లు (7 సంవత్సరాలు). ప్రైవేట్ స్టడీ చేసినవారికి తహసీల్దార్ ఇచ్చిన రెసిడెన్స్ సర్టిఫికెట్.
- తహసీల్దార్ జారీ చేసిన ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికెట్ (BC/SC/ST రిజర్వేషన్ క్లెయిమ్ చేసిన అభ్యర్థులకు మాత్రమే).
- తహసీల్దార్ జారీ చేసిన EWS సర్టిఫికెట్ (EWS రిజర్వేషన్ క్లెయిమ్ చేసిన అభ్యర్థులకు).
- రిఫరల్ హాస్పిటల్ జారీ చేసిన PH సర్టిఫికెట్ (వర్తిస్తే).
- RCI సర్టిఫికెట్ (వర్తిస్తే).
- రక్షణ శాఖ, భారత ప్రభుత్వ సంబంధిత అధికారులచే జారీ చేసిన సర్వీస్ సర్టిఫికెట్ (ఎక్స్-సర్వీస్‌మెన్ కోటా కోసం అప్లై చేసిన అభ్యర్థులకు).
- ప్రిన్సిపాల్ పోస్టుకు మాత్రమే – అనుభవ సర్టిఫికెట్.
Note: ఈ సర్టిఫికెట్ల జాబితా అభ్యర్థుల అవగాహన కొరకు మాత్రమే ఇవే ప్రామాణికం కాదు వెరిఫికేషన్ టీం అడిగిన సర్టిఫికెట్లు అభ్యర్థులు చూపించాల్సి ఉంటుంది
Note: This list of certificates is only for the candidates’ reference. It is not final. Candidates must produce the certificates as required by the verification team.