మహబూబాబాద్ విధ్యుత్ శాఖ ఎస్ఈ నరేష్
మహాతెలంగాణ న్యూస్ /మరిపెడ.
వేసవికాలం దృష్ట్యా విద్యుత్ సరఫరా లో ఎలాంటి అంతరాయం లేకుండా చూస్తామని, ప్రస్థాయిలో ఓవర్ లోడు లో వోల్టేజ్ సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే అధికారులకు తెలియజేయాలని విద్యుత్ శాఖ ఎస్ఈ నరేష్ అన్నారు. బుధవారం మరిపెడ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన విద్యుత్ సమస్యల పరిష్కార వేదికలు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తొలుత డివిజన్ పరిధిలో నూతనంగా బదిలీపై వచ్చిన విద్యుత్ అధికారులు, జేఎల్ఎంలు, సిబ్బందిని పరిచయం చేసుకొని అనంతరం వినియోగదారుల ఫిర్యాదులు స్వీకరించారు. వేసవి కాలంలో గృహ వినియోగదారులకు విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాల హెచ్చుతగ్గులు లేకుండా చూస్తామన్నారు. అదేవిధంగా పట్టణాల్లో నిరంతర విద్యుత్తు నాణ్యమైన విద్యుత్తు పరిశ్రమలకు వినియోగదారులకు అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాలకు సంబంధించి మరమ్మతులను ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటును కొత్త లైన్లు పునరుద్ధరణను పరిశీలించాలని సూచించారు. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో జేఎల్ఎంలు, విద్యుత్ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. అదేవిధంగా సాగుకు యోగ్యం కాని భూముల్లో సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసుకోవాలని, 2 ఎకరాలు, 4 ఎకరాలు చొప్పున సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని 80% బ్యాంకు రుణం మంజూరు అవుతుందన్నారు. ఆసక్తి కలిగిన రైతులు విద్యుత్ శాఖ అధికారులు సంప్రదించి వివరాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు ఒంటికొమ్ము యుగేందర్ రెడ్డి, అధ్యక్షులు పెండ్లి రఘువీరారెడ్డి, కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెదబోయిన ఐలమల్లు, ప్రధాన కార్యదర్శి గుగులోతు రవి నాయక్, కాంగ్రెస్ నాయకులు షేక్ అఫ్జల్, మాలోతు భీకు నాయక్, అజ్మీర శీను, కుడితి నరసింహారెడ్డి, వీసారపు శ్రీపాల్ రెడ్డి, విద్యుత్ డీ ఈ మధుసూదన్, ఏ డి ఈ అజయ్, ఏఈలు పావని, నవ్య, లైన్మెన్లు, సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.