- ఈ నెల 22 నుండి కేజీబీవీల్లో ప్రవేశాల కోసం ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరణ*
- సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు IAS., గారు
రాష్ట్రంలోని 352 కేజీబీవీల్లో 2025- 26 విద్యా సంవత్సరానికి గానూ 6,11 తరగతుల్లో ప్రవేశాల కోసం, 7, 8,9, 10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం బాలికల నుండి ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు IAS.. గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్ లైన్ దరఖాస్తులు మార్చి 22 నుండి ఏప్రిల్ 11 వరకు అందుబాటులో ఉంటాయని అన్నారు.

అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ (బడి మానేసిన వారు) పేద, ఎస్.సి, ఎస్.టి, బిసి, మైనారిటీ, బి.పి.ఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణింపబడతాయని తెలిపారు. ఈ దరఖాస్తు https://apkgbv.apcfss.in/ సైట్ ద్వారా పొందగలరు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందుతుంది. సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో నేరుగా చూడవచ్చు. ఏవైనా సమస్యలు, సందేహాలకు 7075159996, 7075039990 నంబర్లు సంప్రదించాలని కోరారు.
Download Complete Notification