డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (డీఎంహెచ్ఓ – అనంతపురం) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్, డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్(DMHO-Ananthapuram) అనంతపురంలో కాంట్రాక్ట్ విధానంలో క్లీనికల్ సైకాలజిస్ట్, ఆడియోలజిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.
ముఖ్యమైన తేదీలు:
ఏప్రిల్ 10న దరఖాస్తు చేసుకోవాలి
మొత్తం ఖాళీలు సంఖ్య: 16 పోస్టులు
భర్తీ చేసే పోస్టులు:
. క్లీనికల్ సైకాలజిస్ట్, ఆడియోలజిస్ట్, ఫార్మసీ ఆఫీసర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు
క్లినికల్ సైకాలజిస్ట్: 01
ఆడియోలజిస్ట్/స్పీచ్ థెరపిస్ట్: 01
ఆప్టొమెట్రిస్ట్: 01
ఫార్మసీ ఆఫీసర్: 01
డేటా ఎంట్రీ ఆపరేటర్: 04 పోస్టులు
లాస్ట్ గ్రేడ్ సర్వీస్(గ్రేడ్-4): 08 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో టెన్త్ క్లాస్, డిగ్రీ, డీ.ఫార్మసీ, బీ.ఫార్మసీ, ఎం.ఫిల్ (సోషల్ సైకాలజీ, మెంటల్ హెల్త్), ఎంఏ సైకాలజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా చూస్తారు.
వయస్సు: 2025 జనవరి 1 నాటికి 42 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.300 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.150 ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. నెలకు క్లినికల్ సైకాలజిస్ట్‌కు రూ.33,075, ఆడియోలజిస్ట్/స్పీచ్ థెరపిస్ట్‌కు రూ.36,465, ఆప్టోమెట్రిస్ట్‌కు రూ.29,549, ఫార్మసీ ఆఫీసర్‌కు రూ.23,393, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.18,450, గార్డెనర్‌కు రూ.15,000 వేతనం ఉంటుంది.
చిరునామా: ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, అనంతపురం చిరునామాకి అప్లికేషన్ పంపాలి.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
Download Complete Notification and Application