అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే ఆశయంతో కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోన్న పీఎం-కిసాన్ నిధులు శనివారం జమయ్యాయి. ఈ పథకం కింద 20వ విడత నిధులను ప్రధాని మోదీ నేడు విడుదల చేశారు. రైతులకు ఏటా ఒక్కోవిడత రూ.2వేల చొప్పున మూడు విడతల్లో రూ.6వేల సాయం అందించే ‘పీఎం కిసాన్’ పథకాన్ని కేంద్రం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించింది. ఇప్పటివరకు 11 కోట్ల మంది రైతులకు 19 వాయిదాల్లో రూ.3.46 లక్షల కోట్లు అందజేసింది.
డబ్బు ఖాతాలో జమయ్యిందా? తెలుసుకోండిలా..
▪️ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in/ కి వెళ్లాలి.
▪️కుడి వైపున కనిపిస్తున్న ఆప్షన్లలో బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్ ఉంటుంది.
▪️సెలక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ లేదా ఖాతా నెంబరును ఎంటర్ చేసి ‘గెట్ డేటా’ పై క్లిక్ చేయాలి.
▪️స్టేటస్ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఒకవేళ మీరు పీఎం కిసాన్కు రిజిస్టర్ చేసుకొని, ఈ-కేవైసీ పూర్తిచేసి ఉంటే ఖాతాలోకి డబ్బు జమవుతుంది.
▪️అలాగే లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో.. లేదో.. కూడా చెక్ చేసుకోవచ్చు.
▪️బెనిఫిషియరీ స్టేటస్ కింద బెనిఫిషియరీ లిస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది.
▪️ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మరొక పేజీకి రీడైరెక్ట్ అవుతుంది.
▪️ఇక్కడ లబ్దిదారుడి రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామాలను ఎంచుకొని ‘గెట్ రిపోర్ట్’పై క్లిక్ చేస్తే లబ్దిదారుల జాబితా కనిపిస్తుంది.
Annadata Sukhibhava Payment Status