వై.యస్.ఆర్. కడప జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీ కోసం విడుదలైన తాజా నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ ఉన్నాయి. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
వై.యస్.ఆర్. కడప జిల్లా అంగన్‌వాడీ నోటిఫికేషన్ 2026
జిల్లా మహిళా & శిశు సంక్షేమ శాఖ, కడప జిల్లాలోని వివిధ ఐ.సి.డి.యస్ (ICDS) ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:
అంగన్‌వాడీ కార్యకర్తలు (AWW): 30 పోస్టులు
అంగన్‌వాడీ సహాయకురాలు (AWH): 141 పోస్టులు
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల తేదీ: 29.03.2026
దరఖాస్తుకు ఆఖరు తేదీ: 13.04.2026 (సాయంత్రం 5:00 గంటల లోపు)
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ: 23.04.2026
అర్హత ప్రమాణాలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు క్రింది అర్హతలు కలిగి ఉండాలి:
వయస్సు: 01.07.2026 నాటికి 21 నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలి. (ఎస్.సి/ఎస్.టి అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో 18 ఏళ్లు నిండిన వారిని పరిగణనలోకి తీసుకుంటారు)
నివాసం: అభ్యర్థి ఖచ్చితంగా స్థానిక వివాహిత మహిళ అయి ఉండాలి.
విద్యార్హత: 10వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం (మొత్తం 100 మార్కులు)
అభ్యర్థుల ఎంపిక క్రింది పారామీటర్ల ఆధారంగా జరుగుతుంది:
పారామీటర్లు – మార్కులు
10వ తరగతి ఉత్తీర్ణత: 50 మార్కులు
ప్రీ-స్కూల్ టీచర్ ట్రైనింగ్ / ECE వర్కర్ అనుభవం: 05 మార్కులు
వితంతువు (Widow): 05 మార్కులు
వితంతువు (మైనర్ పిల్లలు ఉన్నవారు) : అదనంగా 05 మార్కులు
అనాథ అభ్యర్థులు (ప్రభుత్వ సంస్థల నుండి): 10 మార్కులు
వికలాంగ అభ్యర్థులు (Minor Locomotor): 05 మార్కులు
మౌఖిక ఇంటర్వ్యూ: 20 మార్కులు
మొత్తం: 100 మార్కులు
దరఖాస్తు ప్రక్రియ
అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు సంబంధిత విద్యార్హత మరియు ఇతర ధృవీకరణ పత్రాలను (ఆధార్, రేషన్ కార్డ్, వోటర్ కార్డ్ లేదా మీ-సేవ ద్వారా జారీ చేయబడిన స్థానికత పత్రం) జతచేయాలి.
అన్ని పత్రాల నకలులపై గెజిటెడ్ అధికారి ద్వారా అటెస్టేషన్ చేయించాలి.
పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత శిశు అభివృద్ధి పథక అధికారి (ICDS Project Office) కార్యాలయంలో సమర్పించి రశీదు పొందాలి.
ముఖ్య గమనికలు:
స్థానికతను అంగన్‌వాడీ కేంద్రం ఉన్న గ్రామం లేదా మున్సిపల్ వార్డు ఆధారంగా నిర్ణయిస్తారు.
వికలాంగుల కోటాలో కేవలం ‘మైనర్ లోకోమోటర్ వైకల్యం’ ఉన్నవారు మాత్రమే అర్హులు.
పూర్తి సమాచారం మరియు దరఖాస్తు ఫారమ్ కోసం https://kadapa.ap.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఇంటర్వ్యూ ప్రదేశం: సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) వారి కార్యాలయము.
Download Complete Notification